కలం, నిర్మల్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) నుంచి డిప్యూటేషన్ (ఓడీ) ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లోని పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF Posts) విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని, ఈ నెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

