ఏపీలో రేపటి నుంచి స్కూల్స్‌ ప్రారంభం.. 2026–27 షెడ్యూల్ విడుదల

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి పాఠశాలలు (AP Schools) తిరిగి ప్రారంభం కానున్నాయి. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్కూల్ క్యాలెండర్‌ను (Academic Calendar) రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 229 పని దినాలు ఉండగా, 87 రోజులు సెలవులు ఉండనున్నాయి. విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకుని అకడమిక్ షెడ్యూల్‌ను సమగ్రంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా, పరీక్షల షెడ్యూల్స్‌ను కూడా ముందుగానే ప్రకటించడం ద్వారా విద్యార్థులకు సన్నద్ధం కావడానికి అవకాశం కల్పించారు. ఇక తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>