స్థానిక ఎన్నికలపై వైసీపీ పిటిషన్.. హైకోర్టు సంచలన తీర్పు!

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలనామినేషన్ల పర్వం (AP Local Body Elections) ఉద్రిక్తతలకు దారితీస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు బలగాలను మోహరింపచేయాలన్న పిటిషన్‌కు జోడిస్తూ అదనపు అఫిడవిట్ ను వైసీపీ దాఖలు చేసింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల వేళ తగిన భద్రతా బలగాలను మోహరించాలని, పోటీ చేసే అభ్యర్థులకు ప్రాణరక్షణ కల్పించాలని వైసీపీ కోరింది.

దీంతో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పించాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల సమయంలో చెలరేగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. విజయవాడ కేంద్రంగా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే స్పందిస్తామని వెల్లడించిన అధికారులు, ప్రజల సౌకర్యార్థం 0866-2490023, 024, 025, 026 నంబర్లను అందుబాటులో ఉంచారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>