స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్లపై కుదిరిన పొత్తు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక ఎన్నికల్లో (AP Local Body Elections) ఎట్టకేలకు కూటమి పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కొద్ది రోజులుగా సీట్ల ఖరారుపై నెలకొన్న ప్రతిష్టంభన వీడిపోయింది. రాత్రి వరకు జరిగిన చర్చలతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సఖ్యత కుదిరి.. ఎక్కడెక్కడ పోటీ చేయాలో క్లారిటీ వచ్చింది. టీడీపీ 11 కార్పొరేషన్లలో పోటీ చేయబోతుండగా జనసేన నాలుగు, బీజేపీ రెండు కార్పొరేషన్లను దక్కించుకున్నాయి. అలాగే, టీడీపీ 78 మున్సిపాలిటీల్లో పోటీ చేయబోతుండగా జనసేనకు 21, బీజేపీకి 7 మున్సిపాలిటీలను కేటాయించారు. జనసేన పార్టీకి శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు దక్కాయి. బీజేపీకి రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్లను కేటాయించారు.

సీఎం చంద్రబాబుతో భేటీ..

సీఎం చంద్రబాబుతో జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ లింగమనేని రమేష్, బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు. అనంతరం పోటీ చేసే స్థానాలపై క్లారిటీ తీసుకొచ్చారు. ఏ పార్టీకి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయాలని.. మిగిలిన రెండు పార్టీలు బేషరతుగా మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అసంతృప్తులను కలుపుకుని వెళ్లి.. కూటమి పార్టీలే అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను దక్కించుకునేలా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>