కలం, వెబ్ డెస్క్: మహిళల ఆరోగ్య సమస్యలలో అత్యంత ప్రధానమైన, విస్తృతంగా కనిపించే సమస్య రక్తహీనత (Anemia in Women). ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో మిలియన్ల మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా చెప్పాలంటే, శరీరంలో తగినంత రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటారు.
మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలు
పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు
1. నెలసరి: ప్రతి నెల రుతుక్రమం వల్ల మహిళల శరీరం నుండి రక్తం, ఐరన్ నష్టపోతుంటారు.
2. గర్భధారణ, బాలింత సమయం: గర్భిణీగా ఉన్నప్పుడు తల్లితో పాటు కడుపులోని బిడ్డకు కూడా రక్తం అవసరమవుతుంది. ఈ సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోతే రక్తహీనత వస్తుంది.
3. పోషకాహార లోపం: భారతీయ కుటుంబాలలో మహిళలు తరచూ తమ ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఆహారంలో ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లోపించడం వల్ల ఈ సమస్య తెలెత్తుతుంది.
ప్రధాన లక్షణాలు:
నిరంతర అలసట, నీరసం, ఏ పనిపైన శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా చర్మం, గోళ్లు, కళ్లు తెల్లగా మారడం, కొద్దిగా నడిచినా ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయట. తరచూ తల తిరగడం, తలనొప్పి, కాళ్లు, చేతులు చల్లగా అవ్వడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
నివారణోపాయాలు, ఆహార నియమాలు
రక్తహీనతను నివారించడానికి, హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు
ఆకుకూరలు: పాలకూర, తోటకూర, మునగాకు వంటి వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
నట్స్, డ్రైఫ్రూట్స్: ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అత్తి పండ్లు, పప్పులు.
ధాన్యాలు, బెల్లం: రాగులు, సజ్జలు, పంచదారకు బదులుగా బెల్లం వాడటం వల్ల ఐరన్ అందుతుంది.
మాంసాహారం: చికెన్, లివర్, గుడ్లు, చేపలలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

