బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో మూలా నక్షత్ర శోభ

కలం, వెబ్ డెస్క్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్ర పర్వదిన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ శుభదినాన తమ చిన్నారులకు అక్షరాభ్యాసం (Basara Aksharabhyasam) చేయించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసాల కోసం భక్తుల క్యూ మార్గాలు పూర్తిగా నిండిపోయాయి.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల అక్షరాభ్యాస మహోత్సవాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 3 గంటల నుంచే అర్చకులు ప్రత్యేక అక్షర శ్రీకర పూజలు ప్రారంభించారు. వేడుకలు సజావుగా సాగేందుకు వీలుగా ఒక్కో మండపానికి 8 మంది పూజారులను నియమించి అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈ శరన్నవరాత్రి పర్వదినాన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారు భక్తులకు ప్రత్యేకంగా కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకుని, తమ పిల్లలకు విద్యారంభం చేయించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయం మంత్రముగ్ధమైన ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>