అనన్య నాగళ్ల ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ క్లారిటీ

కలం, వెబ్​ డెస్క్​: తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌కు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంలో వస్తున్న అనవసరపు విమర్శలను చూస్తుంటే తనకు ఆశ్చర్యంగా ఉందని  తెలిపారు. అసలు సబ్‌స్క్రిప్షన్​ అంటే ఏమిటి, దాని వల్ల యూజర్లకు కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలపై తాను 2025లోనే పూర్తి వివరాలతో కూడిన వీడియోను విడుదల చేశానని ఆమె గుర్తు చేశారు. కేవలం తనపై విమర్శలు చేయాలనే ఉద్దేశంతో కొందరు చేస్తున్న కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పూర్తి అవగాహన కోసమే ఈ వివరణ ఇస్తున్నానని అనన్య స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>