కలం, వెబ్ డెస్క్: కడప (Kadapa) నగరంలో వైసీపీ శ్రేణులు భారీగా ఆందోళన (YSRCP Protest) చేపట్టాయి. స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి నేతలు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ నిరసనకు దిగాయి. ఉద్దేశపూర్వకంగా తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి, మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేశాయి. వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని.. సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించాయి. ఇదిలా ఉంటే కడప, పులివెందుల పట్టణాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలపై పోలీసులు టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత..
పల్నాడు (Palnadu) జిల్లా రాజుపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలపై కొందరు రాళ్లు రువ్వడంతో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలే తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వైసీపీ ఆందోళన (YSRCP Protest) చేపట్టింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోరుమామిళ్ల మండలంలో కూడా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో గొడవ తలెత్తింది.
Also Read : స్థానిక ఎన్నికల్లో హింసపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు!
Follow Us On: X(Twitter)

