కలం, సోన్ : సోన్ మండలం న్యూ బొప్పారం (New Bopparam) గ్రామానికి చెందిన లోలం సుశాంత్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల ఎల్ఓసీ చెక్కును (LOC Cheque) బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

