ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేల హామీ

కలం, నాగర్‌కర్నూల్: నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన డిమాండ్లను ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి జేఏసీ నాయకులు తీసుకెళ్లారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల (NHM Employees) సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యేలు, వారి డిమాండ్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ మేరకు సోమవారం మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు. అలాగే, సోమవారం ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులు తమను కలవాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు (NHM Employees) ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు.

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులు 13 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, జేఏసీ ప్రతినిధులు రేణయ్య, అనంతచారి, డా.సాయికాంత్, డా.జగన్, శ్రీనివాసులు, హైమవతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>