ఐలు కొత్తగూడెం జిల్లా కోర్టు నూతన కమిటీ ఎన్నిక!

కలం, ఖమ్మం బ్యూరో: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) కొత్తగూడెం (Kothagudem ) జిల్లా కోర్టు కమిటీ జనరల్ బాడీ సమావేశం మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కటకం పుల్లయ్య, అధ్యక్షుడిగా రావిలాల రామారావు, ప్రధాన కార్యదర్శిగా కిలారు పురుషోత్తం రావు, కోశాధికారిగా దూళిపాల రవి కుమార్ నియామకమయ్యారు. ఈ కార్యక్రమానికి ఐలు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వృత్తిపరంగా ఎదురవుతున్న వివిధ సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కోర్టుకు చెందిన పలువురు ప్రముఖ న్యాయవాదులు, ఐలు ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>