కలం, వెబ్ డెస్క్: రాష్ట్రానికి కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇన్ చార్జ్ బీఎం.సందీప్ (AICC In-Charge BM Sandeep) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 22న గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్వహించనున్న కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశానికి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ బీఎం సందీప్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పీఏసీ సభ్యులు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు మధ్యాహ్నం నిర్వహించనున్న టీపీసీసీ (TPCC) విస్తృతస్తాయి సమవేశంలో పార్టీ ముఖ్యనేతలు, నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక 23వ తేదీన కూడా బీఎం.సందీప్ (BM Sandeep) హైదరాబాద్లోనే మకాం వేయనున్నట్లు సమాచారం. కొత్త ఇన్ చార్జ్ తో సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు భేటీ కానున్నారు. కాగా, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, రాజకీయాలు, నేతల మధ్య అనైక్యతపై ఈ పర్యటనలో సందీప్ చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read : మేనిఫెస్టో ప్రతులను చించి, చెత్తబుట్టలో వేసి.. బీఆర్ఎస్ నిరసన!
Follow Us On : WhatsApp

