గోల్డెన్ అవర్ రెస్పాన్స్ శిక్షణ ప్రారంభించిన ఏసీపీ వసుంధర

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా వి.ఎమ్.బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డెన్ అవర్ రెస్పాన్స్ శిక్షణ కార్యక్రమాన్ని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (ACP Vasundhara Yadav) ప్రారంభించారు. శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వైద్య బృందం సమక్షంలో సీపీఆర్, ప్రథమ చికిత్స, అత్యవసర కాల్స్, పీఎం రహత్, నగదు ప్రోత్సాహకం సామాజిక బాధ్యత, గోల్డెన్ అవర్ రెస్పాన్స్ టైమ్ మొదలైన వాటి గురించి వివరించారు. అదే విధంగా రహదారి భద్రత, హెల్మెట్, సీటుబెల్టు ప్రాధాన్యతపై ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయక‌పోవ‌డం, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని డ్రైవర్లకు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఆర్ఐ, ఎస్సై వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది,గ్రామ ప్రజలు వాహనదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>