కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ సవాల్: సెంట్రల్ పార్క్‌లో ఉద్రిక్తత!

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేడు ఢిల్లీలోని సెంట్రల్ పార్క్‌లో నిరసనల (CJP Protest)కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌కు ముందు అధికారులు భద్రతా ఆంక్షలు విధించి, సెంట్రల్ పార్క్‌ను పూర్తిగా మూసివేశారు.

పార్కు మూసివేతపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. పోలీసు అరెస్టులకు, ఆంక్షలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. “నేను దేనికీ భయపడటం లేదు, ఇక్కడే ఉన్నాను.. రండి నన్ను అరెస్ట్ చేయండి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీప్కే బహిరంగ సవాల్ విసిరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>