ఐటీఎఫ్ టెన్నిస్ రన్నరప్‌గా బెంగళూరు చిన్నారి సృష్టి కిరణ్

కలం, స్పోర్ట్స్ : బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల టెన్నిస్ సంచలనం సృష్టి కిరణ్ (Srishti Kiran) అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిసింది. ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ (J100) టోర్నమెంట్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. వరుసగా ఐదు ఐటీఎఫ్ జూనియర్ టైటిళ్లు గెలిచిన ఫామ్‌తో సృష్టి గ్వాటెమాలా బరిలోకి దిగింది. అక్కడ కూడా తన అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు దూసుకెళ్లింది.

ఈ టోర్నీ తొలి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి కాటియా మారియాపై సృష్టి (Srishti Kiran) 6-1, 6-0తో ఘన విజయం సాధించింది. అనంతరం ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ సారా స్టోయానోవ్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో మెక్సికోకు చెందిన నాలుగో సీడ్ హన్నే ఎస్ట్రాడాపై గెలుపొందింది. ఇక సెమీఫైనల్లో అమెరికా రెండో సీడ్ ఫిలిపా డెల్గాడోపై 6-2, 6-1తో తిరుగులేని విజయం నమోదు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది.

టైటిల్ పోరులో అమెరికా టాప్ సీడ్ ఎల్లెరీ మెండెల్‌తో సృష్టి తలపడింది. తొలి సెట్‌లో సృష్టి మొదట 3-1 ఆధిక్యంలో నిలిచింది. కానీ ప్రత్యర్థి గట్టిగా పుంజుకుని ఆ సెట్‌ను 6-4తో గెల్చుకుంది. రెండో సెట్‌లో ఇద్దరూ 3-3తో సమానంగా ఉన్నప్పుడు సృష్టికి లీడ్ సాధించే అవకాశం వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమెకు కండరాలు పట్టేయడంతో కదలికలు మందగించాయి. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా సృష్టి పట్టుదలతో పోరాడింది. చివరకు 4-6, 3-6 తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.

బలమైన క్రీడాకారిణులతో తలపడటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని సృష్టి తెలిపింది. టైటిల్ గెలవలేకపోయినా ఈ వారం ఆట నుండి ఎన్నో సానుకూల విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 461వ ర్యాంకులో ఉన్న ఆమె, ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకు దూసుకెళ్లనుంది.

Read Also: పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి.. రీతూ కథ ఇదే..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>