మహబూబాబాద్ కలెక్టరేట్‌లో సీఐడీ సోదాలు

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కలెక్టరేట్‌లోని గనులు, భూగర్భ శాఖ కార్యాలయంలో సీఐడీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారుల సమాచారం ప్రకారం.. కార్యాలయంలోని రికార్డులు, ఫైళ్లు, సంబంధిత పత్రాలను సీఐడీ అధికారులు (CID Officials) క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ సోదాలకు గల కారణాలు లేదా దర్యాప్తు వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమైన ఫైళ్ల ఆధారంగా ఏదైనా అక్రమాలు జరిగాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.

Read Also: తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలకు డీజీపీ ఆదేశం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>