హైదరాబాద్ – విజయవాడ హైవే పై పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివారు హయాత్‌నగర్ వద్ద పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం (Petrol Tanker Accident) సృష్టించింది. లక్ష్మారెడ్డి పాలెం హైదరాబాద్ – విజయవాడ హైవే జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న కార్లను తప్పించబోయి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా, కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ట్యాంకర్ క్యాబిన్‌లో లోపలే డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతికష్టం మీద క్యాబిన్ లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. గాయాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుండడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Read Also: హైటెక్స్‌లో ‘పోచంపల్లి ఇక్కత్’ వస్త్ర ప్రదర్శన: కలెక్టర్ అనురాగ్ జయంతి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>