అనుమతి లేని విద్యాసంస్థలను అడ్డుకుంటాం: AIFB

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో పలు ప్రైవేట్ విద్యాసంస్థలు, అకాడమీలు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు. అనుమతి లేని ‘రెజోనెన్స్ అకాడమీ’ ప్రచార కార్యక్రమానికి వస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణను అడ్డుకుంటామని ప్రకటించడంతో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ.. అనుమతిలేని విద్యాసంస్థలను రద్దు చేయాలని చెబితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి గౌరవనీయ వ్యక్తులు అక్రమంగా నిర్వహిస్తున్న రెజోనెన్స్ అకాడమీకి ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. అకాడమీల పేరుతో పగటిపూట కూడా కళాశాలలు నడపడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనల ప్రకారం అకాడమీలు కేవలం సాయంత్రం వేళల్లో మాత్రమే నిర్వహించుకోవాలని గుర్తుచేశారు. విచ్చలవిడిగా విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also: అన్నామలై రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>