కుర్చీలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు

కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి (Kannepalli) మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం కాస్తా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

నిబంధనల ప్రకారం స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల ద్వారా ఈ చెక్కులను పంపిణీ చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందడుగు వేసి చెక్కులను పంపిణీ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి అధికార బలంతో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పరస్పర దూషణలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉన్న కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణతో చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. స్థానికులు, లబ్ధిదారులు భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>