తల తాకట్టు పెట్టయినా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇస్తా : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : తల తాకట్టు పెట్టయినా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం అసిఫాబాద్ మండలం కొఠారి కొత్త గూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అలాగే, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 112.4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏ గూడెలో కూడా గుడిసె ఉండకూడదన్నారు. నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆదివాసీల కోసం 21 వేల ఇళ్లను అదనంగా ఇస్తామని సీఎం ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>