డబ్బు నిర్వహణలో మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్

కలం, వెబ్‌డెస్క్: డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. నేటి ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదుగుతున్నారు. అయితే, కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా, ఆ డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే ఆర్థిక నిర్వహణ (Financial Management)పై కూడా మహిళలకు పూర్తి అవగాహన ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీని కోసం గృహిణులు కొన్ని బడ్జెట్ ప్లానింగ్స్ (Budget Planning) చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆర్థిక ప్రణాళిక ముఖ్యం

పెళ్లయ్యాక అందరు మహిళలకు ఉద్యోగం చేయడానికి కుదరకపోవచ్చు. ఒక్కోసారి కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల రీత్యా వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి గృహిణిగా కొనసాగాల్సి రావచ్చు. అలాంటప్పుడు మహిళలు ఇంట్లో ఉన్నా డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టాలట. ప్రతి రూపాయీ వృథా కాకుండా బడ్జెట్ ప్లాన్ (Budget Planning) వేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నెలనెలా ఇంటి అవసరాలు, ఖర్చులకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని కొంత బడ్జెట్‌ను నిర్దేశించుకోవాలని చెబుతున్నారు. అందులో అత్యవసరమైన వాటికే ఖర్చు పెట్టి మిగిలిన మొత్తాన్ని నిపుణుల సలహాతో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.

దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి

కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు భార్యాభర్తలను విడదీస్తాయి. జీవిత భాగస్వామిని కోల్పోవడం లేదంటే విడాకులు తీసుకోవడం వంటివి. ఈ రెండు సందర్భాల్లో సింగిల్ మదర్ గానే మహిళలు తమ పిల్లల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లల చదువు, పెళ్లి.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అప్పటికే వీటికి సంబంధించిన పొదుపు, పెట్టుబడి పథకాల్లో డబ్బు జమ చేస్తుంటే వాటిని కొనసాగించాలని సూచిస్తున్నారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వంటివి తీసుకోవడం అవసరమంటున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చచ్చంటున్నారు. దీంతో పాటు కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని జమ చేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు. అలాగే మీ పెట్టుబడులు, వాటిలోని లాభనష్టాల గురించి కూడా ఏ నెలకానెల చెక్ చేసుకోవడమూ మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నారు.

రిటైర్మెంట్ తర్వాతా

సాధారణంగా చాలామంది విషయంలో.. రిటైర్మెంట్ వయసొచ్చే నాటికే పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి రుణం.. వంటి పెద్ద లక్ష్యాలన్నీ తీరిపోయి ఉంటాయి. ఈ క్రమంలో మిగిలిన సొమ్మును సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎఫ్ఎ.. వంటి రిస్క్ తక్కువగా ఉండే వాటిలో నిపుణుల సలహాతో పెట్టుబడి పెట్టచ్చు. ఇలా పొదుపు చేసిన డబ్బును మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

Read Also: బెంగళూరులో వీఐపీ మూమెంట్ కలకలం.. వ్యక్తి నిరసన వైరల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>