ఆకాశం నుంచి నోట్ల వర్షం: అసలు ఏంజరిగిందంటే ?

కల, వెబ్ డెస్క్‌: ఆకాశం నుండి వర్షం కురవడం సహజం, కానీ అక్కడ మాత్రం ఒక్కసారిగా ఐదు వందల నోట్ల వర్షం కురిసింది. ఈ వింత సంఘటనను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. అసలు విషయంలోకి వెళితే.. ఒక న్యాయవాది రెండు లక్షల రూపాయల నగదును ఒక బ్యాగులో పెట్టుకుని సేల్ డీడ్ చేయించడం కోసం కచేరీ రోడ్డుకు చేరుకున్నారు. ఆయన పనిలో నిమగ్నమై ఉండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఒక కోతి క్షణాల వ్యవధిలో ఆ డబ్బుల బ్యాగును లాక్కొని చెట్టుపైకి ఎక్కేసింది.

అక్కడితో ఆగని ఆ వానరం, చెట్టుపై కూర్చుని బ్యాగును చింపేసింది. దాంతో అందులో ఉన్న రూ. 500 నోట్లన్నీ గాల్లో ఎగురుతూ కిందకు పడటం ప్రారంభించాయి. ఈ ఊహించని దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న జనం వెంటనే తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు  తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ (Bulandshahr) కచ్చహరి రోడ్డులో ఈ వింత సంఘటన చోటు చేసుకున్నది. ప్రస్తుతం ఈ కోతి చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Also: ఆమ‌ర‌ణ దీక్ష చేస్తానంటున్న ష‌ర్మిల‌.. ఎందుకంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>