కలం, సినిమా : మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటించిన లేటెస్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “భర్త మహాశయులకు విజ్ఞప్తి” (Bhartha Mahasayulaku Wignyapthi). టాలెంటెడ్ డైరెక్టర్ కిశోర్ తిరుమల (Kishore Tirumala) తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. రవితేజ గత సినిమాలను పోలిస్తే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఇంతవరకు ఓటీటీ రిలీజ్ అవ్వలేదు.
సాధారణంగా థియేటర్‌లో రిలీజ్ అయిన 4 వారాలకు ఏ సినిమా అయినా ఓటీటీ (OTT) స్ట్రీమింగ్‌కు వస్తుంది. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్ ఫామ్ కొనుగోలు చేసింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అయింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్దం అయింది. ఈ నెల 13న జీ5 ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ప్రముఖ సంస్థ జీ5 మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మరికొద్ది రోజుల్లో జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Read Also: వృషకర్మతో చైతూకి కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తా : కార్తీక్ దండు
Follow Us On: Instagram

