ఆ మైనింగ్ ప్లాంట్‌ను సీజ్ చేయాలి: ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్

కలం, వెబ్​ డెస్క్​ : మంత్రి పొంగులేటి (Minister Ponguleti) రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన అక్రమ మైనింగ్ ప్లాంట్‌ను తక్షణమే సీజ్ చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ (Dasoju Sravan) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్డుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో, 111 జీవో పరిధిలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్లాంట్ కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ మైనింగ్ ప్లాంట్ ఉన్న భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని దళిత బిడ్డలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అక్కడ జరిగిన మైనింగ్, క్రష్ చేసిన మెటల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కగట్టి, భారీ జరిమానా రూపంలో ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రావణ్ (Dasoju Sravan) పేర్కొన్నారు.

Read Also: 99 రోజుల ప్రగతి ప్రణాళిక లోగో విడుదల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>