కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్-అమెరికా (Iran- israel ) అత్యంత భయంకరంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా అదే స్థాయిలో తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఎంబసీ, సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఆయిల్ రిఫైనరీలను ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయెల్ మీద భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ లోని ఓ అధికారి మాట్లాడుతూ.. ఇరాన్ లో పాలన మారే వరకు అమెరికా యుద్ధం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది.
తమ దేశంలో పాలన మార్పునకు ప్రయత్నిస్తే ఇజ్రాయెల్ (Iran- israel) లోని డిమోనా అణు ప్లాంట్ ను పేల్చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఆర్థిక మూలాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇరాన్ వెల్లడించింది. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లోని నిఘా వ్యవస్థలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ వ్యవస్థలను టార్గెట్ చేయడంతో.. పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అమెరికా తన దాడులను మరింత ఉధృతం చేసింది. ఇరాన్ ను పూర్తిగా దెబ్బతీస్తామని ఇప్పటికే వైట్ హౌస్ ప్రకటించింది. అధునాతన ఆయుధాలను వాడుతున్నామని ట్రంప్ తెలిపారు.

