epaper
Wednesday, March 4, 2026
epaper

దక్షిణాఫ్రికాకు దడ పుట్టిస్తున్న కివీస్​.. 77కే సగం వికెట్లు

కలం, వెబ్​ డెస్క్​: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో(T20 World Cup 2026) భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలకమైన మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్ జట్టు కివీస్ బౌలర్ల ధాటికి 10.2 ఓవర్లలో 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

న్యూజిలాండ్ బౌలర్ కోల్ మెకోంచీ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే డబుల్ అటాక్ చేసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ తీశాడు. క్వింటన్ డి కాక్ 8 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 10 పరుగులు చేసి ఫెర్గూసన్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. ర్యాన్ రికెల్టన్ ఎదుర్కొన్న మొదటి బంతికే ఫిన్ అలెన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.  మార్క్​రమ్​ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేసినా .. 21 బంతుల్లో 18 పరుగులు (1 ఫోర్, 1 సిక్స్) చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అనంతరం ధాటిగా ఆడుతున్న డెవాల్డ్​ బ్రెవిస్​(34; 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​లు)ను జేమ్స్​ నీషమ్​ పెవిలియన్​కు చేర్చగా, మరో డేంజరస్​ బ్యాట్స్​మన్​ డేవిడ్​ మిల్లర్​(6)ను ఔట్​ చేసి రచిన్​ రవీంద్ర తన ఖాతాలో రెండ్​ వికెట్ చేర్చుకున్నాడు. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 84/5 పరుగులతో ఆడుతోంది. క్రీజులో ట్రిస్టన్​ స్ట్రబ్స్​(4), మార్కో యాన్​సన్​(3) ఉన్నారు. దక్షిణాఫ్రికా(T20 World Cup 2026) గౌరవప్రదమైన స్కోరు సాధించాలంటే వీళ్లతోపాటు మిగిలిన బ్యాటర్లూ బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!