కలం, డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్ (TG Police) ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్న పోలీస్ కమిషనరేట్ ను హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ గా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక డిపార్టుమెంటుగానే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కొనసాగనున్నది. పోలీసు కమిషనరే ఆ డిపార్టుమెంటులో ఆర్థిక అధికారాలు కలిగి ఉంటారు.
ఇప్పటికే గ్రేటర్ పరిధిలో మూడు పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. అయితే గ్రేటర్ పరిధిని విస్తరించిన నేపథ్యంలో.. ఫ్యూచర్ సిటీలో కూడా పోలీస్ కమిషనరేట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆల్రెడీ ఉన్న రాచకొండ కమిషనరేట్ ను మల్కాజిగిరి కమిషనరేట్ గా మార్చుతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో కొన్ని డివిజన్లు అటు ఇటు మారబోతున్నాయి.
Read Also: హుటాహుటిన అమిత్ షా ఇంటికి రేవంత్, డీజీపీ (Video)
Follow Us On: Instagram

