కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi) నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన “రయ్ రయ్ రా రా” సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సాంగ్‌కి అదిరిపోయే మ్యూజిక్ అందించడమే కాకుండా స్వయంగా పాటను ఆలపించారు. అయితే ఈ సాంగ్‌లో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్స్‌కి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫిదా అయ్యారు. తాజాగా “రయ్ రయ్ రా రా” సాంగ్ పై ప్రశంసలు కురిపించారు.
‘పెద్ది’ సినిమాలోని ఈ పాట స్క్రీన్‌పై అగ్నిలా దహిస్తుందని, ఎనర్జీ, ఎమోషన్, సినీమాటిక్ బ్రిలియన్స్ కలయికగా అద్భుతంగా నిలిచిందని పేర్కొన్నారు. రామ్ చరణ్ తన గ్రేస్, స్పీడ్‌తో డాన్స్ అదరగొట్టాడు. దర్శకుడు బుచ్చిబాబు పిక్చరైజేషన్ అద్భుతమని చిరంజీవి (Chiranjeevi) కొనియాడారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) అందించిన మ్యాజికల్ కంపోజిషన్, వోకల్స్కు ప్రత్యేక ప్రశంసలు తెలిపారు. అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) అందించిన పవర్‌ప్యాక్డ్ స్టెప్స్‌ను చిరంజీవి మెచ్చుకున్నారు. ఈ పాటకు అద్భుతమైన లిరిక్స్ అందించిన అనంత్ శ్రీరాం, అద్భుతమైన విజువల్స్ అందించిన డీఓపి రత్నవేలు, నిర్మాత సతీష్ కిలారుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Read Also: సంగీత్ వీడియో రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
Follow Us On: X(Twitter)

