epaper
Tuesday, March 3, 2026
epaper

టీలో చక్కెర మానేయాలా.. ? ఈ చాక్లెట్ హ్యాక్ ట్రై చేయండి..

కలం, వెబ్ డెస్క్ : ఆరోగ్యం అనేది మనం రోజూ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టీ లేదా కాఫీలో మనం వేసుకునే ఆ చిన్న స్పూన్ చక్కెర మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావమే చూపుతుంది. మనం చక్కెరను ఎక్కువగా టీ లేదా కాఫీ రూపంలోనే తీసుకుంటాం. దానిని తగ్గించడం కోసం టీ లేదా కాఫీలో నేరుగా చక్కెర వేయకుండా, ఒక చిన్న చాక్లెట్ ముక్కను పక్కన పెట్టుకుని, ఒక్కో సిప్‌తో పాటు చిన్న బైట్ తీసుకోవడం ద్వారా చక్కెర అలవాటును మానుకోవచ్చని సెలబ్రిటీ కోచ్ డాక్టర్ శిల్పా అరోరా(Shilpa Arora) సూచించారు.

నిపుణులు ఏమంటున్నారు?

డైటీషియన్ దీపాలక్ష్మి ఈ చిట్కాపై స్పందిస్తూ.. ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. డార్క్ చాక్లెట్‌లో ఉండే చిన్న చిరు చేదు టీతో కలిసినప్పుడు తీపి కోరికను తగ్గిస్తుంది. అయితే, మిల్క్ చాక్లెట్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్లలో కూడా కొంత చక్కెర ఉంటుంది. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చక్కెర మూలాన్ని మార్చినట్లు అవుతుందే తప్ప, తీపి అలవాటును పూర్తిగా వదులుకోవడం సాధ్యం కాదని ఆమె హెచ్చరించారు.

అసలు చక్కెరను ఎందుకు తగ్గించాలి?

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి, అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదనపు క్యాలరీలు శరీరంలో కొవ్వుగా మారి ఊబకాయానికి కారణమవుతాయి. చక్కెర వాడకం వల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.

సరైన మార్గం..

చక్కెరను ఒక్కసారిగా మానేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఒకేసారి కాకుండా, రెండు స్పూన్ల నుండి ఒకటి, ఆపై సగం స్పూన్‌కు చక్కెరను తగ్గించాలి. దీనివల్ల మీ నాలుక ఆ రుచికి అలవాటు పడుతుంది. టీలో దాల్చిన చెక్క, అల్లం లేదా యాలకులను వేసుకోవడం వల్ల చక్కెర లేకుండానే మంచి రుచిని పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!