కలం, వెబ్ డెస్క్: వంగవీటి మోహన రంగా(Vangaveeti Ranga) కుమార్తె ఆశాలత తన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లో ఆసక్తి లేదని చెప్పలేను కానీ, దానికి ఇంకా సమయం ఉందన్నారు. ఇంకా పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆశా లత తెలిపారు. వంగవీటి మోహన రంగా అభిమానుల కోసమే రాధా రంగా మిత్ర మండలిని నడుపుతున్నానని వెల్లడించారు. రాజకీయానికి తాను వ్యతిరేకం కాదని, దానికి ఇంకా టైం ఉందని చెప్పారు. రాధారంగా మిత్ర మండలిని విజయవంతంగా నడిపించడం తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. అలాగే తన రాజకీయ నిర్ణయానికి, రాధా రంగా మిత్ర మండలికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అందులో అన్ని పార్టీలు, కులాలు, మతాల వారు ఉన్నారని, దీన్ని ఒక్క రాజకీయ పార్టీకి, కులానికి, మతానికి పరిమితం చేయొద్దని భావిస్తున్నట్లు వెల్లడించారు.


