epaper
Monday, March 2, 2026
epaper

ఏపీని భయపెడుతోన్న మరో తుఫాన్

Cyclone Senyar | ఆంధ్రప్రదేశ్‌ను మరో తుఫాను భయపెడుతోంది. మొంథా దెబ్బకు ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇంతలోనే మరో తుఫాను ఆంధ్ర అతి చేరువలో ఉండటం ఇప్పుడు కీలకంగా మారింది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలపడనుందని అంచనా వేస్తున్నారు. సోమవారానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐఎండీ తాజా అంచనా ప్రకారం, బుధవారం నాటికి ఈ వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం అధికంగా ఉంది. తుపానుగా మారితే దీనికి ‘సెన్‌యార్‌(Cyclone Senyar)’ అనే పేరు ఇవ్వనున్నారు. ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది.

Read Also: వాట్సాప్‌ గ్రూపుల్లోకి సైబర్ క్రిమినల్స్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!