కలం, వెబ్‌డెస్క్: అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిని చితకబాదిందొక టీచర్. ఈ అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla) ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో బుధవారం జరిగింది. పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, లక్ష్మీ దంపతుల కుమారుడు విద్వాన్ (3) స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్నాడు. ఈ రోజు ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తిరిగొచ్చిన బాలుడి కంటి వద్ద నల్లగా కమిలి, బాగా వాచి ఉండడం చూసి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. శరీరంలో మరికొన్ని చోట్ల కూడా దెబ్బలు ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే చిన్నారిని విషయం అడగ్గా, టీచర్ కొట్టినట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చిన్నారిని ఎలాంటి కారణం లేకుండా టీచర్ విచక్షణా రహితంగా కొట్టినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Also: ఈరోజే జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డా : చిరంజీవి
Follow Us On: Sharechat


