epaper
Wednesday, February 18, 2026
epaper

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బురదలో వేసినట్టే : మాజీ మంత్రి మోత్కుపల్లి

కలం, ఆలేరు : ఆలేరు నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్​ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే బురదలో వేసినట్టే అని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు (Motukupalli Narasimhulu) అన్నారు. ప్రజలంతా ప్రజా పాలనను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీని ఆలేరు మున్సిపల్​ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్లు చేసే పని శూన్యమని ఎద్దేవా చేశారు. ఆలేరులో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నందునా బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపిస్తే నిధులు తేచ్చి పనులు చేయించడంలో విఫలమవుతారన్నారు. దీంతో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన పాలకవర్గం ఆలేరులో కొలువుతీరినా ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

20 ఏళ్ల క్రితం ఆలేరు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ పల్లెలతో పాటుగా పట్టణాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. ఆలేరులో 12 వార్డులకు గాను 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. వారిని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు జోడిగా పంపితే ఆలేరు పట్టణాన్ని మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాడని తాను మాటిస్తున్నానని హామీనిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ చైర్మన్ కు పట్టం కట్టాలని మోత్కుపల్లి (Motukupalli Narasimhulu) పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మాజీ డిసిసి అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ఎజాజ్, నాయకులు కట్ట కొమ్ముల సాగర్ రెడ్డి, చింతల ఫణి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు అశోక్, చీర శ్రీశైలం, కానుగు బాలరాజ్ గౌడ్, మిత్రపక్షాల నాయకులు చెక్క వెంకటేష్, ఇక్బాల్ మోరిగాడి రమేష్ , తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>