epaper
Wednesday, February 18, 2026
epaper

న్యాయవాదిగా మారనున్న సీఎం మమతా బెనర్జీ

కలం, వెబ్ డెస్క్ : నేడు సుప్రీంకోర్టులో ఎస్‌ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ విచారణలో మమతా బెనర్జీ స్వయంగా న్యాయవాదిగా మారి తన వాదనలు వినిపించనున్నట్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టు(Supreme Court) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బుధవారం జరిగే విచారణలో తానే కోర్టులో హాజరై, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తన పిటిషన్‌ను స్వయంగా వాదించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆమె కోరనున్నారు. దేశ చరిత్రలో తొలిసారి ఒక ముఖ్యమంత్రి స్వయంగా న్యాయవాదిగా మారి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తన కేసును వాదించనున్న నేపథ్యంలో రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>