epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

యూనియన్ బడ్జెట్‌ 2026.. సామాన్యులకు దక్కిందేంటి?

కలం, వెబ్ డెస్క్: యూనియన్ బడ్జెట్ 2026లో (Union Budget 2026)  మధ్యతరగతి వేతనదారులకు పెద్దగా ఊరట దక్కలేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను స్లాబ్‌లలో ప్రత్యక్ష ఊరట ఏదీ దక్కలేదు. బడ్జెట్‌‌లోని కొన్ని అంశాలు మధ్యతరగతి ప్రజలు, చిన్న పెట్టుబడిదారులకు ఊరట నిచ్చాయి. వేతనదారులకు కొత్త పన్ను రాయితీ లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే కొనసాగించనున్నారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికి రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ కలిపితే, మొత్తం పన్ను రహిత ఆదాయం రూ.12.75 లక్షలకు చేరుతుంది. ఈసారి పన్ను స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

కస్టమ్స్ రేట్లు సులభతరం

యూనియన్ బడ్జెట్ 2026(Union Budget 2026)లో విదేశీ రిమిటెన్సులపై కస్టమ్స్‌ రేట్లను సులభతరం చేశారు. విదేశీ టూర్‌ ప్యాకేజీల టీసీఎస్‌ను ప్రస్తుతం ఉన్న 5 శాతం, 20 శాతం నుంచి తగ్గించి 2 శాతానికి తీసుకురానున్నారు. లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ (LRS) కింద విద్య, వైద్య అవసరాల కోసం చేసే రిమిటెన్సులపై టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులను జూలై 31 వరకు దాఖలు చేయవచ్చు. నాన్‌-ఆడిట్‌ వ్యాపారాలు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. షేర్‌ బైబ్యాక్‌లపై ఇప్పటివరకు డివిడెండ్‌గా పన్ను విధించే విధానాన్ని మార్చి, వాటిని క్యాపిటల్ గెయిన్స్‌గా పన్ను విధించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది చిన్న రిటైల్‌ ఇన్వెస్టర్లకు రక్షణగా నిలవనుంది.

మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ ద్వారా వ్యక్తులకు లభించే వడ్డీ ఆదాయాన్ని పూర్తిగా ఆదాయపు పన్ను నుంచి మినహాయించారు. దీనిపై ఇప్పటివరకు అమలులో ఉన్న టీడీఎస్‌ను కూడా తొలగించారు. డివిడెండ్లు, వడ్డీ ఆదాయాలపై టీడీఎస్ మినహాయింపుల కోసం ఫామ్‌ 15G, 15Hలను డిపాజిటరీల ద్వారా సింగిల్‌ విండోలో దాఖలు చేసే విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.

చౌకైన మందులు, ఉత్పత్తులు

సుమారు 17 క్యాన్సర్‌ మందులపై డ్యూటీ మినహాయింపు ఇవ్వడంతో అవి చౌకవుతాయి. అలాగే ఏడు అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులను వ్యక్తిగత వినియోగం కోసం డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. మైక్రోవేవ్‌ ఓవెన్లు, టీవీ పరికరాలు, లెదర్‌ ఉత్పత్తులు, పాదరక్షల తయారీలో ఉపయోగించే కీలక భాగాలపై కూడా సుంకం తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశముంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను రూ.12 లక్షల కోట్లకు పైగా పెంచారు. పర్యాటకం, రైల్వేలు, లాజిస్టిక్స్‌, టెక్నాలజీ రంగాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: సంక్షేమం ప్లేస్‌లో ఉత్పత్తి, ఇన్‌ఫ్రా..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>