కలం, సినిమా : మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప కవలలుగా పుట్టారని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు వారుసుడొచ్చాదంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రముఖులంతా రామ్ చరణ్ , ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు.. మీ కుటుంబానికి ప్రేమ, ఆరోగ్యం మరియు ఆనందం కలగాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ (NTR) ట్వీట్ చేశారు.
Read Also: ఫంకీ సెకండ్ సింగిల్ రిలీజ్
Follow Us On: Pinterest


