కలం, వెబ్ డెస్క్: బారామతిలో ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి నేడు ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. మోడీతో పాటు అమిత్ షా, నితిన్ నబీన్, ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా హాజరు అవ్వాల్సి ఉంది. కానీ, అకస్మాత్తుగా చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయ్యింది. ఆయన స్థానంలో మంత్రి లోకేశ్(Nara Lokesh) మహారాష్ట్రకు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నేడు మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. పలు శాఖల పనితీరుపై కీలక సమీక్షలు చేయనున్నారు.


