epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

టార్గెట్ హరీష్ రావు.. కవిత కౌంటర్లు..!

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా హరీష్ రావును టార్గెట్ చేస్తోంది కవిత (Kavitha). ఇక ట్విట్టర్ లో కవిత అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కవిత పేరు మీద కొన్ని ఐడీలు క్రియేట్ చేసి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. అప్పట్లో కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తున్న టైమ్ లో హరీష్‌ రావు నవ్వుతున్నాడంటూ కొన్ని వీడియోలను వదిలి రచ్చ చేశారు కవిత ఫ్యాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్న హరీష్‌ రావును, ఇవాళ కేటీఆర్ ను విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. కేటీఆర్ విచారణ సందర్భంగా కవిత అభిమానులు ఒక వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. ఇందులో ఏముందంటే.. మొన్న హరీష్‌ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న టైమ్ లో బీఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ ముందు రచ్చ చేశారు. పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది.

కేటీఆర్ విచారణ టైమ్ లో..

నేడు కేటీఆర్ ను విచారిస్తుంటే పోలీస్ స్టేషన్ ముందు ఎలాంటి హడావిడి లేదని.. ఇదంతా హరీష్ రావు కుట్ర అంటూ కవిత అభిమానులు ఆరోపిస్తున్నారు. హరీష్‌ రావు కోసం కేటీఆర్ కార్యకర్తలను సమీకరించి అంత చేస్తే.. కేటీఆర్ కోసం హరీష్ రావు ఏం చేశారంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కవిత అభిమానులు నడిపించే ఐడీలన్నీ కవిత మద్దతుతోనే కొనసాగుతున్నాయనే ప్రచారం ఉంది. వీటిల్లో వచ్చే వీడియోలు, ఫొటోలు, ఇతర స్క్రిప్టులన్నీ కవిత ఆలోచనలకు అద్దం పడుతాయని అంటున్నారు నెటిజన్లు. అందులో భాగమే ఈ తాజా వీడియో అంటున్నారు.

హరీష్ రావే మెయిన్ టార్గెట్..

హరీష్ రావు వల్లే తనకు బీఆర్ ఎస్ లో రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని కవిత పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా బలపరిచి.. కొత్త రాజకీయ శక్తిగా దాన్ని మార్చుకోవాలని కవిత భావిస్తున్నారు. హరీష్ రావును రాజకీయంగా దెబ్బ తీస్తేనే తనకు రాజకీయ ఎదుగుదల ఉంటుందనేది కవిత భావన. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఇలా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో హరీష్ రావుమీద రంగులు అద్ది కవిత సెల్ఫ్ గోల్ వేసుకుంటోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొనసాగిస్తారా..?

కవిత రాజకీయ శక్తిగా ఎదగాలి అనుకుని తనకు ప్రధాన శత్రువుగా హరీష్ రావునే చూస్తున్నారు. మరి ఇలా హరీష్‌ రావును టార్గెట్ చేయడం రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందా లేదంటే ఒక స్టేజ్ వరకు వెళ్లి ఆపేస్తారా అనేది తెలియాలి. హరీష్‌ రావును టార్గెట్ చేసిన రేంజ్ లో అధికార పక్షాన్ని, ఇతర పక్షాలను కవిత టార్గెట్ చేయట్లేదనే వాదనలు కూడా లేకపోలేదు. మరి కవిత రానున్న రోజుల్లో తన రూటు మారుస్తారా లేదంటే ఇలాగే కొనసాగిస్తారా చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>