కలం, వెబ్ డెస్క్ : బీఆర్ ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్ సజ్జనార్ (Sajjanar) నోటీసులు ఇచ్చారు. తనపై ఏడు కేసులున్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారని.. వాటిపై రెండు రోజుల్లో ఆధారాలు ఇవ్వాలని సజ్జనార్ నోటీసుల్లో తెలిపారు. లేదంటే ప్రవీణ్ కుమార్ మీద క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సజ్జనార్ (Sajjanar) కు సిట్ చీఫ్ గా వ్యవహరించే అర్హత లేదని.. ఆయనపై కేసులున్నాయంటూ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై సజ్జనార్ ఇలా నోటీసులు ఇచ్చారు.


