కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని మిర్చి మార్కెట్ (Khammam chilli market)లో దళారులు రైతులను మోసం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు క్వింటా మిర్చి రూ.20వేలు పలుకగా, ఈ రోజు ఐదు వేలు తక్కువకు కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై వేలు ఉంటుందని ఆశతో చాలా దూరం నుంచి సరుకు తీసుకొని వచ్చామని, ఇక్కడ దళారులు రూ.15వేలు క్వింటాకు అడుగుతున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ సారి దిగుబడి కూడా తగ్గిందని, దానికి తోడు ధర విషయంలో దళారులు చేస్తున్న మోసంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని పలువురు రైతులు దిగులు పడుతున్నారు. పంట కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాగానే దళారులు అధిక ధర చెల్లించి రైతులను ఆకట్టుకుంటారు. తీరా పంట మార్కెట్ (Khammam chilli market) కు పోటెత్తాక రేట్లను అమాంతం తగ్గిస్తుంటారు. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతు నష్ట పోతున్నాడు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ పాలక వర్గాలు, అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also : కేటీఆర్ విచారణ… సజ్జనార్ కీలక ప్రకటన
Follow Us On : Twitter


