కలం, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir Encounter ) లోని కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. నిఘావర్గాల సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సోదాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బిల్లావర్ ఏరియాలోని పార్హెతర్ ప్రాంతంలో దాగిన ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో అతను కాల్పులు జరిపాడు. వెంటనే భద్రతా దళాలు ఉగ్రవాది ఉంటున్న ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో టెర్రరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఉగ్రవాదికి పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాది కొన్నేళ్లుగా జైషే మహ్మద్‌లో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు చెప్పాయి. సమీపంలోని ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా దాగి ఉన్నారేమోనని సోదాలు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Read Also : జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. జైషే ఉగ్రవాది హతం
Follow Us On : Twitter


