కలం, వెబ్ డెస్క్ : ఒక కేసు విచారణలో భాగంగా దగ్గుబాటి బ్రదర్స్ (Daggubati Brothers) కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న తీరుపై నాంపల్లి న్యాయస్థానం సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని స్పష్టం చేస్తూ, సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్టాన్ని అతిక్రమించి ఎన్నిసార్లు తప్పించుకు తిరుగుతారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
ఫిబ్రవరి 5వ తేదీన కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని దగ్గుబాటి బ్రదర్స్ (Daggubati Brothers)ను న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ ఆ రోజున కూడా హాజరు కాకపోతే, వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొన్నది.


