కలం, వెబ్డెస్క్: తెలంగాణకు జాతర కళ వచ్చింది. అటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు గుడి మెలిగే, మండ మెలిగే వేడుకలతో బీజం పడగా, ఇటు మహా పూజతో నాగోబా జాతర (Nagoba Jatara) నేటి నుంచి ప్రారంభం కానుంది. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన నాగోబా జాతరకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతరలో భాగంగా నేడు మహాపూజ జరగనుంది. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాకు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేయనున్నారు.
ఈరోజు (ఆదివారం) ఉదయం పది గంటలకు మహా పూజ మొదలవుతుంది. మొస్రం వంశస్థులు గోదావరి నుంచి సేకరించిన జలంతో స్వామిని అభిషేకిస్తారు. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో భాగంగా ఈనెల 22న గిరిజన దర్బార్ నిర్వహిస్తారు.25వ తేదీతో వేడుక ముగుస్తుంది.
ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు తరలిరానున్నారు. మొక్కులు తీర్చుకోనున్నారు. ఆదివాసీల సంప్రదాయాలు, నృత్యాలు, వేషాలు, అటవీ ఉత్పత్తులు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ.

Read Also: నేటి నుండి కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
Follow Us On : WhatsApp


