epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

కలం, వెబ్ డెస్క్ : కాకినాడలో గ్రీన్ కో కంపెనీ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ 1.5 మిలియన్ల గ్రీన్ అమ్మోనియాను, 1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసే గ్రీన్ అమ్మోనియాను సింగపూర్, జపాన్, జర్మనీ, లండన్ దేశాలకు ఈ కంపెనీ ఎగుమతి చేయబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.18వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది సందరు కంపెనీ. 8వేల మందికి డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ.

ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2028 నాటికి 0.5 ఎంఎంటీపీఏ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని.. 2023 నాటికి ఈ సామర్థ్యం 1.0 ఎంఎంటీపీఏకు చేరుకోవాలన్నది కంపెనీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగానే ఈ కంపెనీ ప్రారంభం అవుతుందని కూటమి నేతలు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>