కలం, వరంగల్ బ్యూరో : మేడారం ట్రస్టు (Medaram Trust) బోర్డు చైర్ పర్సన్ గా తాడ్వాయి మడలానికి చెందిన ఇర్ప సుకన్య సునీల్ దొర (Sukanya Sunil Dora) ప్రమాణ స్వీకారం చేశారు. చైర్ పర్సన్ తో పాటు 15 మంది డైరెక్టర్లతో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క (Seethakka) ప్రమాణ స్వీకారం చేయించారు. జాతర పూర్తయ్యేంత వరకే ట్రస్ట్ బోర్డు ఉనికిలో ఉంటుంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ మధ్య జరిగే జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది.
Read Also: ఉమ్మడి కరీంనగర్ మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఇవే..!
Follow Us On: Sharechat


