epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

బీసీలకు 3 కార్పొరేషన్లు.. 38 మున్సిపాలిటీలు..!

క‌లం వెబ్ డెస్క్‌ : రాష్ట్రంలోని మున్సిపల్ సంస్థల్లో రిజర్వేషన్లకు (Municipal Reservations) సంబంధించి మున్సిపల్ శాఖ పూర్తి వివరాలను ప్రకటించింది. మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో (Municipal Corporations) ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో కార్పొరేషన్ చొప్పున, బీసీలకు మూడు కార్పొరేషన్లు కేటాయించినట్లు తెలిపింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను జనరల్ ఓపెన్ (అన్ రిజర్వుడ్‌)గా ప్రకటించారు. ఈ రిజర్వేషన్ విధానానికి అనుగుణంగానే మేయర్ పదవులకు ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. ఈ మేర‌కు మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 121 మున్సిపాలిటీల్లో ఎస్టీ వర్గానికి 5, ఎస్సీ వర్గానికి 17, బీసీ వర్గానికి 38 మున్సిపాలిటీలను రిజర్వ్ చేశారు. మిగిలినవి జనరల్ కేటగిరీకి కేటాయించారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం ఎస్టీ జనరల్‌గా, మహబూబ్‌నగర్ బీసీ మహిళగా, మంచిర్యాల బీసీ జనరల్‌గా, కరీంనగర్ బీసీ జనరల్‌గా, రామగుండం ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ అయ్యాయి. వరంగల్‌ను అన్ రిజర్వుడ్‌గా ప్రకటించారు.

ఇక మహిళా జనరల్ కేటగిరీలో ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండతో పాటు జీహెచ్ఎంసీని కూడా ప్రకటించారు. ఈ రిజర్వేషన్ విధానం స్థానిక సంస్థల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిథ్యం కల్పించేలా రూపొందించినట్లు మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల (Municipal Elections) ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బీసీ మహిళలు :

బాన్సువాడ, కామారెడ్డి, దుబ్బాక, కొల్లాపూర్, పరిగి, ఇల్లెందు, అచ్చంపేట, చెన్నూరు, మెదక్, కొత్తకోట, ములుగు, ఆలేరు, ఆత్మకూరు, దేవరకొండ, గజ్వేల్, దేవరకద్ర, నర్సంపేట్, కాగజ్‌నగర్, జగిత్యాల

బీసీ జనరల్ :

జనగాం, భూపాలపల్లి, ఐజ, వడ్డేపల్లి, బిచ్‌కుంద, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, మద్దూరు, పెద్దపల్లి, మంథని, వేములవాడ, షాద‌నగర్, జిన్నారం, జహీరాబాద్, గుమ్మడిదల, సిద్దిపేట్, హుజూర్‌నగర్

అన్ రిజర్వుడ్‌ జనరల్ మహిళ :

నర్సాపూర్, యాదగిరిగుట్ట, ఆదిలాబాద్, సంగారెడ్డి, కోరుట్ల, మధిర, ధర్మపురి, సిరిసిల్ల, వైరా, రామాయంపేట్, చౌటుప్పల్, అశ్వారావుపేట, ఆర్మూరు, సత్తుపల్లి, నారాయణపేట, భువనగిరి, మరిపెడ, మిర్యాలగూడ, తూప్రాన్, బెల్లంపల్లి, ఆలియాబాద్, కోదాడ, బీంగల్, సదాశివపేట, ఇస్నాపూర్, క్యాతన్‌పల్లి చిట్యాల, వనపర్తి, గద్వాల, నిర్మల్, కల్వకుర్తి

ఎస్టీ మహిళ :

కేసముద్రం, ఎల్లంపేట్

ఎస్టీ జనరల్ :

మహబూబాబాద్, భూత్‌పూర్, కల్లూరు

ఎస్సీ మహిళ :

చేర్యాల, వికారాబాద్, ఇంద్రేం, ఏదులాపురం, గడ్డపోతారం, మోతుకూరు, హుజూరాబాద్, చొప్పదండి

ఎస్సీ జనరల్ :

స్టేషన్ ఘన్‌పూర్, జమ్మికుంట, దోర్నకల్, లక్సెట్టిపేట్, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్

మున్సిపల్ కార్పొరేషన్లు :

కొత్తగూడెం – ఎస్టీ జనరల్
రామగుండం – ఎస్సీ జనరల్
మహబూబ్‌నగర్ – బీసీ మహిళ
మంచిర్యాల – బీసీ జనరల్
కరీంనగర్ – బీసీ జనరల్
ఖమ్మం – మహిళా జనరల్
నిజామాబాద్ – మహిళ జనరల్
గ్రేటర్ వరంగల్ – అన్ రిజర్వుడ్‌ (ఓపెన్ జనరల్)
గ్రేటర్ హైదరాబాద్ : మహిళ జనరల్
నల్లగొండ – మహిళ జనరల్

కేటగిరీ వారీగా రిజర్వేషన్స్ 

Read Also: ద‌త్త‌త తీసుకున్న జిల్లాకు ఏం చేశావ్‌.. సీఎంపై జోగు రామ‌న్న ఫైర్‌

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>