కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు మండలం విజయనగరం వద్ద గోదావరి నదిలో (Godavari River) పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన కలకలం రేపింది. మృతి చెందిన వారు విజయనగరం ఇసుక ర్యాంపులో (Sand Ramp) పనిచేస్తున్న కార్మికులుగా ప్రాథమిక సమాచారం అందింది. విజయనగరం ఇసుక ర్యాంపు పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు.
పనుల నిమిత్తం నదీ తీర ప్రాంతంలో ఉండగా అనుకోకుండా గోదావరిలో పడిపోయి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా ఒకరి మృతదేహం లభించినట్లు తెలుస్తుంది. మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రంజిత్ అని, విజయనగరం ఇసుక ర్యాంపులో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
Read Also: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా వర్సిటీలు వెలవెల
Follow Us On: Sharechat


