కలం వెబ్ డెస్క్ : దత్తత తీసుకున్న ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు ఏం చేశావని సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) నిలదీశారు. యంగ్ ఇండియా స్కూల్ పేరిట ఓ కాగితం ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఈరోజు 70 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్తున్నారని, ఈ మాటలు తప్ప అసలు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. చనాక-కొరటా ప్రాజెక్టును సీఎం రేవంత్ ప్రారంభించడంపై జోగు రామన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత ఆర్భాటంగా ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్న కారణంగానే సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పినట్లు తెలిపారు.
ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. రూపాయి ఖర్చు చేయకున్నా ప్రాజెక్టు ప్రారంభించారని, అక్కడ బటన్ నొక్కే అర్హత సీఎం రేవంత్‌కు లేదని స్పష్టం చేశారు. నైతిక విలువలు కూడా పాటించని సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని, రేవంత్ పాలనకు గోరి కడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఆదిలాబాద్‌కు వచ్చినా అడ్డుకుంటూనే ఉంటామని, నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Read Also: మున్సి ‘పోల్స్‘ బరిలో ట్రాన్స్‌జెండర్లు
Follow Us On: X(Twitter)


