కలం, వెబ్ డెస్క్: మీ ఇంటి ఆవరణలో తరచుగా పావురాలు (Pigeons) తిరుగుతున్నాయా? ప్రతిరోజు ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయా? అయితే మీరు అలర్ట్ కావాల్సిందే. పట్టణాలు, నగరాల్లో చాలా ఇండ్లు, అపార్టమెంట్ల బాల్కనీలోకి పావురాలు ప్రవేశిస్తుంటాయి. అయితే ఇది అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పావురాల వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా వస్తుందని చెప్పడంతో చర్చకు దారితీసింది.
పావురాలు కేవలం తిరుగాడటమే కాకుండా గూళ్లు పెట్టుకుంటూ రెట్టలు వేస్తుంటాయి. దీంతో బ్యాక్టీరియా వ్యాప్తి చెంది శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని చెబుతున్నారు. గతంలో చాలామంది పావురాల కారణంగా అనారోగ్యం బారినపడినట్లు డాక్టర్లు సైతం గుర్తించారు. స్కాట్లాండ్‌లో ఇద్దరు వ్యక్తులు పావురం క్రిప్టోకోకస్ ఇన్ఫెక్షన్ల కారణంగా మరణించిన ఘటన వెలుగుచూసింది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పక్షుల ద్వారా సంక్రమించే వ్యాధులను తీవ్రమైన ముప్పుగా గుర్తించాయి.
‘‘పావురాలు (Pigeons), వాటి ఈకలు, రెట్టలు ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్యాలకు గురి చేస్తాయి. వాటిలో పిజియన్ బ్రీడర్స్ లంగ్ (ఒక రకమైన హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్)హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తాయి. ఈకల కారణంగా సూక్ష్మ కణాలు గాలిలోకి చేరడం వల్ల పీల్చినప్పుడు శ్వాస, వాపు, ఊపిరితిత్తుల సమస్యలు బారినపడేలా చేస్తుంది‘‘ అని నిపుణులు చెబుతున్నారు.
Read Also: టోల్ గేట్ల వద్ద సైరన్లతో ఫేక్ వీఐపీల హంగామా!
Follow Us On : WhatsApp


