కలం వెబ్ డెస్క్ : సంచలన వ్యాఖ్యలు, చిత్ర, విచిత్ర విన్యాసాలతో నిత్యం వార్తలో నిలిచే నేత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (MLA Malla Reddy). ఆయన అసెంబ్లీలో మాట్లాడినా.. వేదికల మీద మైక్ పట్టుకున్నా వివాదాస్పదమే. పాలమ్మి, పూలమ్మి సక్సెస్ అయిన అంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి (Sankranti) వేళ మరోసారి మల్లారెడ్డి వార్తల్లోకి ఎక్కారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మేడ్చల్ (Medchal) జిల్లాలోని పూడూరు-కిష్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేత ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి పోటీలో పాల్గొన్న మహిళలను ఉత్సాహపరుస్తూ స్వయంగా ముగ్గులు వేశారు. మల్లారెడ్డి ముగ్గు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మల్లారెడ్డి ఏం చేసినా ట్రెండింగే అంటూ నెటిజన్లు సదరు వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.

Read Also: ఆటోలో ప్రయాణించిన మంచు మనోజ్ దంపతులు.. వీడియో వైరల్
Follow Us On: Instagram


